- కండోమ్‌లను కూడా వదలని చైనా.
- 2 లక్షలకు పైగా నకిలీ కండోమ్‌లు యూరప్‌లో స్వాధీనం చేసుకున్నాయి.
- రొమేనియా, సెర్బియా, స్పెయిన్‌లో పట్టుబడిన ఫేక్ మాల్..
నకిలీ కండోమ్‌లు: చైనాలో ఏ బ్రాండ్ వస్తువుకైనా నకిలీ లభిస్తాయి. అంతగా ఆ దేశం ప్రతీ వస్తువును కాపీ కొడుతుంది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తుల వరకు ప్రతీది కాపీ సరకు చైనాలో లభ్యమవుతుంది. చివరకు ”కండోమ్”లను కూడా డ్రాగన్ కంట్రీ వదలడం లేదు. ఏకంగా 2 లక్షల నకిలీ కండోమ్‌లు యూరప్‌లో పట్టుబడ్డాయమి. కఠినమైన భద్రతా నిబంధనలను తప్పించుకునేందుకు, ఈ కండోమ్‌లను ఆట వస్తువులుగా మార్చి, మార్కెట్ చేశారు.
ఇలాంటి కండోమ్‌లు వాడితే వ్యాధులు(STIలు)తో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని అధికారులు చెబుతున్నారు. యూరప్ యొక్క మోస నిరోధక సంస్థ అయిన యూరోపియన్-ఫ్రాడ్ ఆఫీస్ (OLAF) ఈ మోసాన్ని వెలికితీసింది. ఈ దర్యాప్తులో 2,00,000 మొత్తం విలువ కలిగిన 2,00,000 కంటే ఎక్కువ నకిలీ కండోమ్‌లు చైనా నుండి యూరప్‌కు రవాణా చేయబడినట్లు వెల్లడైంది.
రొమేనియా, సెర్బియా, స్పెయిన్ దేశాల్లో ఈ నకిలీ కండోమ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులను మోసం చేయడానికి ప్రముఖ బ్రాండ్ పేరు, లోగోలను కూడా ఉపయోగించుకున్నారు. సాధారణంగా యూరప్‌లో కండోమ్‌లను వైద్య పరికరాలు కేటగిరీ కింద ఉంటాయి. అందువల్ల, మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు అనేక రకాలైన నాణ్యతా పరిశీలనలకు గురిచేస్తారు. కానీ చైనా నుంచి వచ్చిన ఈ ఫేక్ కండోమ్‌లు ఆటవస్తువులుగా ప్రకటించి భద్రతా తనిఖీల నుంచి తప్పించుకున్నాయి. చివరకు అధికారులు ఈ ఫేక్ దందాను బయటపెట్టారు.

