ఆంధ్రప్రదేశ్:ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.
రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy)77వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్లో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ(వైఎస్ విజయమ్మ) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైఎస్ఆర్ సమాధిని పూలతో అలంకరించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిశ్శబ్ద ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

