పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు బెయిల్ ఇచ్చింది. జామీనుతో పాటు రూ.లక్ష పూచీకత్తు, కోర్టు నిర్దేశించిన షరతుల ప్రకారం భగీరథకు బెయిల్ మంజూరైంది. అంతేకాదు, పోలీసుల ఏ విధమైన ఆటంకం కలిగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించిన సాక్షులను, బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని బండి భగీరథ్‌ను ఆదేశించింది. విచారణకు అవసరమైన సమయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు నిర్దేశించిన శరతులు ఉల్లంఘించిన నేపథ్యంలో భగీరథ్ బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, భగీరథ్ కు బెయిల్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ దేశంలో పెద్దవాళ్లకు ఒక న్యాయం…పేదవాళ్లకు ఒక న్యాయం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదే తరహాలో భగీరథ్ కేసు తర్వాత పోక్సో కేసులు అనేక అరెస్టయ్యారని, వారికి బెయిల్ అందించలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పోక్సో కేసులో తొలి దశలో ఉన్న సమయంలో నిందితుడికి బెయిల్ చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి పరిణామాలతో బాలికల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

