Published on: 6:06 pm, 9 జూలై 2026
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మరోసారి మీరు తప్పు చేసి ఉంటే.. మీ ఆస్తులు మొత్తం ఈ పాటికి ఎప్పుడో దోచేసేవారు. అని వైసీపీపై సీఎం చంద్ర బాబు నిప్పులు చెరిగారు. గత గొడ్డలి పార్టీ హయాంలో అందరికీ నరకం చూపించారని.. చివరతనను కూడా వదలకుండా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక టి తెచ్చాడు. మీ భూములపై ఆయన ఫొటోలు వేసుకున్నాడు. మీ భూములు సరిహద్దు రాళ్లపై ఆయన ఫొటోలు వేసుకున్నాడు. రేపు మీ భూములు కూడా తనవేనని చెప్పుకొని అమ్మేసుకున్నా.. మీకు దిక్కులేకుండా చేయాలని పన్నాగం పన్నాడు. కూటమి వచ్చాక.. భూములు ఎవరివో గుర్తించాం. నిజమైన లబ్ధిదారులకు అందేలా చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు. అందుకే ప్రతి నెల 9వ తేదీన రైతులకు పట్టాలు పంపిణీ చేసే కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించిన చంద్రబాబు మీ భూమి-మీహక్కు కింద రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ గొడ్డలి పార్టీ ప్రజలను మోసం చేశారు. ప్రజలు నమ్మి.. ఓటేస్తే.. చివరకు ప్రజల ఆస్తులు దోచుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక వేశారని, దీనిని తాము అడ్డుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు పంపిణీ చేస్తున్నాం. వీటిని డిజిటలీకరణ కూడా చేస్తున్నట్టు చెప్పారు.
తాము మాట ఇచ్చినను నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసింది. ప్రజలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని సంపాయించుకున్న ఆస్తిపై వారికే సర్వహక్కులూ ఉంటాయని తెలిపారు. అలాంటిది గత గొడ్డలి పార్టీ తమ హక్కుగా మార్చుకునేందుకు ప్రయత్నించిందన్నారు. పార్టీలను రాష్ట్రం నుంచి వెళ్లేందుకు ఇలాంటి గొట్టాల ని చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రతి ఒక్కరూ గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించాలని సూచించారు.

