– ప్రకటన –
– కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు : మండల కేంద్రంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డిసిసి సొసైటీ ఛైర్మన్ పదవికి నాకే డిమాండ్ ఉంది కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎంపిటిసి పెరమాల గుట్టయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తాను ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు.
గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ప్రకటించారు. పార్టీ పట్ల తనకున్న అంకితభావాన్ని, చేసిన సేవను గుర్తించి నెల్లికుదురు డీసీసీ/సొసైటీ చైర్మన్ పదవిని తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని విజ్ఞప్తి చేశారు.పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
నేను పార్టీ అభివృద్ధి కోసం ఎప్పటికి నిరంతరం కృషి చేస్తున్నాను మరియు పార్టీ టికెట్ కేటాయించిన వారికి గెలుపు కోసం హర్నిషలు కృషి చేశానని తెలిపాడు. గ్రామస్థాయి ఎన్నికల నుండి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించి గెలుపుకు కృషి చేశానని ఈ సందర్భంగా జరిగింది. పార్టీ అభివృద్ధికి నా ప్రాణంగా ప్రతిరోజు పనిచేస్తున్నానని అందుకోసం నాకు ఈ నెల్లికుదురు పిఎస్ఎస్ డిసిఐకి సంబంధించిన బ్యాంక్ చైర్మన్ పదవిని ఈ సందర్భంగా ప్రతి ఒక్క మండల రాష్ట్ర రాష్ట్ర నాయకులతో పాటు ఎమ్మెల్యేను ఎమ్మెల్యేగా కోరుతున్నట్లు తెలిపారు.
– ప్రకటన –

