హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఒకరోజు ధరలు పెరుగుతుండగా అదనంగా రోజుల ధరలు తగ్గుతూ పసిడిప్రియులను ఊరిస్తున్నాయి. అయితే ఇంతకుముందు బంగారం, వెండి ధరలు మాత్రం భారీగా పెరగడం లేదు. అయితే పశ్చిమాసియాలో తిరిగి మొదలు కావడంతో బంగారం అమ్మకాలు ప్రభావం తగ్గాయి.పశ్చిమాసియాలో యుద్ధంతో గత క్రమంగా ధరలు తగ్గుతున్నాయి. అయితే రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి ధరల్లో కూడా అనిశ్శితి కొనసాగుతుంది. సీజన్ నడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు పెరుగుతున్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గుతున్న ధరలు ఒక్క ఊరట కలిగిస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమ్మకాలు ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, కొనసాగుతున్న యుద్ధాలు, ట్రంప్ నిర్వహిస్తున్న నిర్ణయాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ధరలు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు రానున్న కాలంలో మరింత పెరగనున్నాయన్న వార్తలు కూడా కొంత ఊపుతెస్తున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ నడుస్త పక్కన శుభకార్యాలు కూడా జరగడం డిమాండ్ పెద్దగా లేదు. మరొకవైపు పెట్టుబడి పెట్టేవారు కూడా ముందుకు రావడం లేదు. ధరల్లో అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,410 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,450 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,44,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

