గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం 862 కేజీల గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అంకిత్ కుమార్ సంక్వార్ మాట్లాడుతూ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కేజీల గంజాయిని హన్మకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీ సర్వీసెస్ వద్ద దహనం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, పి.డేవిడ్ రాజు, వైసీపీ సీసీఆర్బీ, ఇన్ స్పెక్టర్లు సంజీవరావు, ఎస్ఐ నరేశ్, పోలీసులు ఉన్నారు.
ములుగు జిల్లాలో 67కేజీలు..
ములుగు, వెలుగు : ములుగు నిర్మాణం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు చేసిన ఎన్డీపీఎస్ కేసుల్లో 67.013 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గురువారం దహనం చేశారు. ఈగల్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రకారం సుమారు రూ.33.50 లక్షల విలువైన 67.013 కేజీల ఎండు గంజాయిని డీసీఆర్ డీఎస్పీ కిశోర్‌కుమార్, మంగపేట ఎస్సై టీవీకే సూరి, ఎస్సై వెంకటేశ్, పోలీస్ బృందం వరంగల్ కాకతీయ మెడి వెస్ట్ యూనిట్లో దహనం చేశారు.

