తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. వీకెండ్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం తిరుమలలో మొదలయిన రద్దీ సోమవారం వరకూ కొనసాగే అవకాశముంది. అలాగే వారంలో నాలుగు రోజులు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీకి అనుగుణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఈ ఏడాది తిరుమలకు భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని తిరుమలకు భక్తులు చేరుకోవడం సామాన్య భక్తులకు దర్శనం గంటల సమయం పడుతుంది.
తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. హుండీ కానుకలతో పాటు విరాళాలు కూడా పెద్దయెత్తున వచ్చి పడుతున్నాయి. మరొకవైపు ఉత్తర భారతం నుంచి తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. దక్షిణ భారత తీర్థయాత్రలకు వచ్చే భక్తులందరూ తిరుమలను దర్శించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందుకే రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలలో శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 70,141 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,821గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకం 4.05 లక్షల మేరకు జరిగాయి. అన్న ప్రసాదం లక్షలు స్వీకరించిన భక్తులు 2.62 మంది ఉన్నారు.

