తెలంగాణ : రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్య కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్య కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ను పట్టించిన వారికి రెండు లక్షల రూపాయల రివార్డును గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున షాబాద్ మండలంలో ఆరుగురిని హత్య చేసి రాజ్ కుమార్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
మూడు రాష్ట్రాల్లో…
అయితే బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. కిరాతకంగా చిన్నారులతో పాటు వృద్ధులను హత్య చేసిన రాజ్ కుమార్ ను పట్టిస్తే రెండు లక్షల రూపాయల నజరాను పోలీసులు ప్రకటించారు.
వార్తల సారాంశం – రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురి హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు.

