Vishnu Priya: సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో యాంకర్ విష్ణుప్రియ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇన్ స్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ అనే ఆప్షన్ ని పెట్టి , అందులో ఆమెకు సంబంధించిన ఎక్సక్లూసివ్ హాట్ వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఒక రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తోంది విష్ణుప్రియ. ఆమె ప్రవర్తించే తీరుపై కొందరు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు, మరికొంతమంది అయితే ఓపెన్ గా తనకు తోచింది , తన శరీరం తన ఇష్టం అంటూ మద్దతు తెలుపుతున్నారు. రీసెంట్ గా ఆమె నిర్వహించిన లైవ్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా బోల్డ్ గా , ఫిల్టర్ లేకుండా చెప్పడం జరిగింది. నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగిన ఒక అభిమానికి 5 అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పింది విష్ణుప్రియ.
లేకపోతే లేటెస్ట్ గా అభిమానులకు ఆమె ఇచ్చిన ఒక రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఒక అభిమాని మాట్లాడుతూ ‘అక్కా సబ్ స్క్రిప్షన్ ప్రైజ్ కాస్త తగ్గించండి. నాతో పాటు మా స్నేహితులు కూడా జాయిన్ అవుతాం. దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి , మేము జాబు లేని కుర్రాళ్ళం’ అంటూ అడగ్గా, అందుకు విష్ణుప్రియ సమాధానం చెప్తూ ‘అయ్యో.. అవునా… అయితే చదువు మీద శ్రద్ధ పెట్టండి, డబ్బు వృధా చేసుకోకండి’ అంటూ బదులిచ్చింది. అంటే రేట్ తగ్గించే ప్రసక్తే లేదు అని చెప్పకనే చెప్పింది విష్ణు ప్రియ . ఒక్కో సబ్ స్క్రిప్షన్ కి విష్ణు ప్రియా ఏకంగా నెలకు 390 రూపాయిలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఆమెకు 6742 మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
అంటే ఆమె నెలవారీ సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలు , టీవీ షోస్ ద్వారా సంపాదించే దానికంటే , ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఆమె కోట్ల రూపాయిలు సంపాదిస్తోంది. విష్ణుప్రియ ని చూసి ఈమధ్య కాలం లో అనేక మంది యంగ్ హీరోయిన్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విష్ణుప్రియ ని చూసి జనాలు ఎంతో ఇష్టపడ్డారు. ఎలాంటి ఫిల్టర్ లేని అమ్మాయి, నిజాయితీగా ఉంది , అని అనుకునేవారు. కానీ ఆమె మరీ ఈ స్థాయి బోల్డ్ గా నిజాయితీగా ఉన్నట్లు మాత్రం ఈమధ్యనే తెలిసింది.

