వియత్నాం: వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు
వియత్నాం: వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు. ప్రమాదం సమయంలో భారతీయులు 32 మంది ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ సిబ్బంది కొందరిని కాపాడగలిగారు. కొందరు గల్లంతయ్యారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు. వియత్నాం బోటు ప్రమాదంలో కడప వాసి శ్రీధర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. అలాగే మచిలీపట్నానికి చెందిన జయశ్రీ కూడా మృతి చెందారు. మచిలీపట్నం వాసి కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వియత్నాంలో పర్యాటక బోటు బోల్తాపడిన ఘటనలో పదిహేను మంది మరణించారు. మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్‌లో విషాదం. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులే ఉన్నారు.
పడవ ప్రమాదానికి గురైన సమయంలో…
సముద్రంలో పడవ ప్రమాదానికి గురయినప్పుడు 400 మీటర్ల దూరంలో ఉంది. ఒక్కసారిగా బోల్తా పడడంతో పడవలో ఉన్న ప్రయాణికులు సముద్రంలో పడిపోయారు. పర్యాటకానికి వెళ్లిన వారు బోటు షికారుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బోటు బోల్తా పడిన వెంటనే పక్కనే ఉన్న బోటు సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని ఒడ్డుకు చేర్చగలిగారు. బోటు తలకిందులుగా పడడంతో పడవలో ఉన్నవారంతా సముద్రంలో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకులను రక్షించడం కష్టంగా మారింది. వీరిలో కొందరిని మాత్రమే రక్షించగలిగారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కంట్రోల్ రూములు ఏర్పాటు…
వాతావరణ మార్పుల కారణంగానే బోటు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. భారత ఎంబసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్: +84 913089165, 362817930, +84 915523714, 334520414 లకు బంధువులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. వియత్నాంలో బోటు ప్రమాదంపై మంత్రి లోకేశ్ ఆరాతీశారు. రాష్ట్ర, ఢిల్లీలోని ఏపీ భవన్ యాత్ర అధికారులతో మాట్లాడిన లోకేశ్ఏపీ నుంచి విహారకు వెళ్లిన పర్యాటకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నట్లు మంత్రి లోకేశ్‌కు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని మంత్రి లోకేశ్ సూచించారు.
వార్తల సారాంశం – వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది చనిపోయారు

