కడప : కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
కడప : కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.3,100 కోట్ల పెట్టుబడిని దాల్మియా భారత్ సిమెంట్ పెట్టనుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ముందుగా ప్లాంట్ ఆవరణకు చేరుకున్న నారా లోకేశ్ కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
మొదట దాల్మియా…
ముందుగా దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించి వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం పునీత్ దాల్మియాతో దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
వార్తల సారాంశం – కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

