కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే చిరంజీవి సామాజిక మాధ్యమం ఃఎక్స్ః వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ ద్వారా తన ప్రగాఢ సంతాపం తెలియజేసారు. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఎంముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతిం అంటూ చిరంజీవి నివాళులర్పించారు.

