వైఎస్ జగన్మోహన్రెడ్డి(వైఎస్ జగన్) కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి ఘన నివాళులర్పించారు.
వైఎస్ జగన్ కిర్లంపూడిలో పర్యటించి ముద్రగడకు నివాళులు అర్పించారు
- ముద్రగడ భౌతికకాయానికి జగన్ నివాళి
- కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్
- ముద్రగడ పాడె మోసిన జగన్
వైఎస్ జగన్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముగిశాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(వైఎస్ జగన్) బుధవారం కిర్లంపూడి చేరుకుని ముద్రగడ భౌతికకాయానికి ఘన నివాళులర్పించారు. భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకున్న జగన్ జగ్గంపేట మీదుగా రోడ్డు మార్గంలో ముద్రగడ నివాసానికి వచ్చారు. శోకసంద్రంలో ఉన్న ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంతిమయాత్రలో జగన్ స్వయంగా పాల్గొన్నారు, ఆయన పాడే మోసి నివాళి అర్పించారు.
నారా లోకేష్: జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ.. వైఎస్సార్సీపీ అధినేతపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
అధికారిక లాంఛనాల నడుమ:
ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించి కొన్ని రాజకీయ వివాదాలు రేగాయి. ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలను నిరాకరించిందనే విమర్శలు, కామెంట్లు గట్టిగా వినిపించాయి. అయితే, చివరకు ఉత్కంఠకు తెరదించుతూ ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసుల గౌరవ వందనం నడుమ, ఆయన ఇంటి ఆవరణలోనే అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.

