థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు ఇతర బాషల ప్రేక్షకులు పెద్దగా తెరమీద చూడలేదు కాబట్టి డిజిటల్ వ్యూస్ భారీగా వస్తాయని అటు నెట్ ఫ్లిక్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇంకా వారం కాకుండానే పెద్ది టాప్ 5లోనే షాక్ కలిగింది. నిజానికి జనాలు అంచనా వేసింది ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందని.
టీవీలో స్మార్ట్ ఫోన్లలో ఉత్తరాది జనాలు పెద్దల్లో చరణ్ నటనకు ప్రశంసలు అందుకున్నారు కానీ కంటెంట్ పట్ల మాత్రం పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు వాళ్ళు చాలా చూసేసి ఉన్నారు ఒక కారణమైతే దర్శకుడు బుచ్చిబాబు చూపించిన మాస్ క్రికెట్ వాళ్లకు అంతగా ఎక్కలేదు. ట్రోలింగ్ కి ఆస్కారం ఇచ్చేలా ఇలాంటి ఆట చూపిస్తారా అంటూ ఎక్స్ లో ట్వీట్లు పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎక్కువ నెగటివ్ టాక్ నడుస్తోంది.
జరిగిపోయిన కథ గురించి ఇప్పుడు కారణాలు లేకపోలేదు. రెండు మూడు సంవత్సరాలు మనం ఎలాంటి కథల మీద వర్క్ చేస్తున్నామో దర్శకులు గుర్తించాలి. ప్యాన్ ఇండియా స్టాంప్ వేసేసి, బడ్జెట్ లు పెంచేసి, నిర్మాతల మీద భారం పెట్టేసి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించే పనైతే వందల కోట్లు ఖర్చు పెట్టడం వలన లాభం లేదు. కనీసం బ్రేక్ ఓవర్ ఈవెన్ కాకపోతే టయర్ 1 హీరోల మార్కెట్ రిస్కులో పడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో.
పెద్దిని ఒక పాఠంగా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎక్కువ కాలం ఖర్చు పెట్టినంత మాత్రాన సానుభూతితో ఆడియన్స్ సినిమాలు చూశారు. అలా అయితే అంజి నుంచి రాజా సాబ్ దాకా కేవలం సింపతీ మీద డబ్బులు తెచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. రంగస్థలాన్ని మించి చరణ్ పదే పదే ఊదరగొట్టిన పెద్ది బృందం రామ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే రాబట్టుకుంది కానీ సబ్జెక్టులో అసలైన దమ్ముని ప్రేక్షకులకు ఇవ్వలేకపోయింది.

