- 20 నుంచి వెబ్సైట్లు ప్రారంభం
- 25 నుంచి 31 వరకు వెబ్ ఐచ్ఛికాలు
- 6న తొలి విడత సీట్ల కేటాయింపు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్2026 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఎంపిక, ఫీజు చెల్లింపునకుగాను దాదాపు 20 నుంచి 29 వరకు అవకాశం కల్పించింది. ఈ గడువులో మీకు నచ్చిన కళాశాలలు, కోర్సుకు ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలి. 22 నుంచి 31 వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలను గుర్తించారు. 25 నుంచి 31 వరకు వెబ్ ఐశ్చికాల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. 6వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించారు. సీటు పొందిన అభ్యర్థులు 7 నుంచి 13 వరకు కేటాయించిన కళాశాలలో స్వయంగా/ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ పూర్తి చేయాలి. ఆగస్టు 10 నుంచి ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమవుతాయి. నిర్ణీత గడువులో కళాశాలకు రిపోర్ట్ చేయకపోతే కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలను ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్కు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.

