ఆంధ్రప్రదేశ్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతలను ఇంకా యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పూర్తయి రెండేళ్లవుతున్నా ఇంకా కొందరు నేతలు మాత్రమే పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అందులోనూ ఒక సామాజికవర్గానికి చెందిన నేతలే ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నారు. మిగిలిన నేతలు బయటకు రావడం లేదు. వైఎస్ జగన్ అనేక పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలు తిరుగుతున్నారు. అయినా అక్కడి వరకే నేతలు పరిమితమవుతున్నారు. పూర్తి స్థాయిలో నేతలు యాక్టివ్ కా వైసీపీ క్యాడర్ కొంత అయోమయంలో ఉన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగన సంబంధిత నేతలు కాకుంటే గెలుపు అసాధ్యమని చెబుతున్నారు.
జగన్ పర్యటనలు విజయవంతం అవుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి క్యాడర్, లీడర్ కలసి పనిచేస్తేనే కొంత సక్సెస్ లభిస్తుంది. కానీ ఇప్పుడు దాదాపు వంద నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇంకా వేచి చూడాలని నాయకులు అనుకోవడమే. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కొంత ఊపు మీద ఉన్నారు వారికి అవసరమైన న్యాయ సాయాన్ని అందించడంలోనూ లీడర్లు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ అనేక సార్లు సమావేశాలు పెట్టి నేతలకు హిట్ చేసినప్పటికీ నేతల్లో మార్పులు రాకపోవడం, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి వ్యాపారాలు సాగడం వంటి కారణాల వల్ల కార్యకర్తలే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీ అధినేత గా జగన్ ఈసారి కూడా తన వల్లనే పార్టీ గెలుస్తుందన్న భ్రమలో ఉన్నారు. కానీ ఆ భ్రమ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో క్యాడర్ కు లీడర్ కు మధ్య సమన్వయ లేమితోనే దారుణ ఓటమి చవి చూడాల్సి వచ్చిందని అంటున్నారు. కానీ తన పర్యటనలకు వస్తున్న జనాలను చూసిన జగన్ కు ఈసారి కూడా తన బొమ్మ తెచ్చి పెడుతుందన్న అతి విశ్వాసంతో ఉన్నారు. కానీ అవతల కూటమి కలసి ఉంటే గెలుపు అన్నది సులువు కాదన్న గుర్తుంచుకుని వీలయినంత త్వరగా నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టుకుంటే మంచిదని కొందరు హితవు పలుకుతున్నారు. మరి జగన్ ఒకరి మాట వినడం కాదంటున్న వారు.. అది జరగని పని.. నష్టం జరిగేంత వరకూ ఆయనంటే అంటూ నిట్టూర్చే వారి సంఖ్య వైసీపీలో ఎక్కువగా ఉంది.

