అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గుంటూరులో దారుణం జరిగింది. యువతి ముంబయిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోండ్రుపాడుకు చెందిన కీర్తి (26)కి ప్రకాశం జిల్లా టంగులూరు మండలం వాసి సాయితో సోషల్ మీడియాలో పరిచయం అయింది. ప్రేమపెళ్లికి సాయి నిరాకరించాడని తెలిసి ముంబయిలో కీర్తి ఆత్మహత్య చేసుకుంది. కీర్తి మృతదేహాన్ని కుటుంబసభ్యులు యువకుడి ఊరికి. యువకుడి ఇంటి ఆవరణలో మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన చేశారు. ఇద్దరూ 8ఏళ్లుగా ప్రేమించుకుంటురన్నకుటుంబ సభ్యులు కీర్తి చివరి కోరికగా మృత దేహానికి సాయి తాళికట్టాలని డిమాండ్ చేశారు. ఇంటి గేటుకు తాళం వేసి సాయి కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

