గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో 163జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మచ్చాపూర్ గ్రామ శివారులో ట్రక్కు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. చెట్టును ఢీకొట్టి ట్రక్కు ఆగిపోయింది. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ ను క్యాబిన్ లో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

