Mr మిడిల్ క్లాస్ రివ్యూ : నటీనటులు: శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్, సునీల్, రఘుబాబు, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, మురళీధర్ గౌడ్
సంగీత దర్శకుడు: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: ‘గరుడవేగ’ అంజి
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాణం: బ్లూ జె క్రియేషన్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ చాలాకాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఈ మిస్టర్ మిడిల్ క్లాస్. శ్రీకాంత్ కు జోడీగా లయ, మరో ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి. సినిమా ట్రైలర్, ఇతర ప్రమోషనల్ మెటీరియల్ తో ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ కాంబినేషన్లు, యంగ్ హీరోల సినిమాలనే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. టైటిల్ లోనే మిడిల్ క్లాస్ అంటూ కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ డివోషనల్ ఫ్యాంటసీ జోనర్ లో సాగుతుంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాలు, దేవుడు ప్రత్యక్షమవడం అనే కాన్సెప్ట్ ఇందులో కీలకం. వెంకటరమణ (శ్రీకాంత్) ఓ పక్కా మిడిల్ క్లాస్ వ్యక్తి. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడు. తన భార్య పద్మావతి (లయ), తండ్రి ఏడుకొండలు (మురళీధర్ గౌడ్), చెల్లి, బావ, పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ ఓ పెద్ద రెస్టారెంట్ పెట్టి భారీగా నష్టపోతాడు. దాంతో ఉన్న హోటల్ ను అమ్మేసి, చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ బాధ్యతలు, పిల్లల ఫీజుల భారం మోయలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుల వాళ్ళు వేధించడం ఎక్కువ కావడంతో దేవుడిపై నమ్మకం పోయింది. అదే సమయంలో వేంకటేశ్వర స్వామి గుడిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వస్తుంది. అక్కడ తన బాధను స్వామితో మొరపెట్టుకుంటాడు. హీరో మొరను వేంకటేశ్వరస్వామి (రాజేంద్ర ప్రసాద్) వినడమే కాకుండా స్వయంగా ప్రత్యక్షమై మొదట కొన్ని నగలు ఇస్తాడు, కానీ అవి వెంకటరమణకు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. ఆ తర్వాత దేవుడు అతనికి గాడ్స్ గిఫ్ట్ అంటే ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ఇచ్చి, అందులో ఏం రాస్తే అది జరుగుతుందని చెప్తూ కొన్ని కండిషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ వెనుక ఉన్న కండిషన్స్ ఏంటి? ఆ పుస్తకంతో వెంకటరమణ కష్టాలు తీరాయా? ఆ దేవుడి రాసిన రాతను మార్చాలని చూసిన వెంకటరమణ జీవితంలోకి యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? చివరికి ఏమైందనేది మిగిలిన కథ.
ఇదంతా వింటుంటే క్రీస్తు పూర్వం విడుదలై హిట్ అయిన యమలీల గుర్తుకువస్తే మంచిదే. అయితే ఇప్పుడు క్రీస్తు శకం అని పిలవడం కూడా సరికాదు అని చెప్పాలి. జెన్ జీ శకం అనడం సబబు. ఇప్పుడు అలాంటి కథతో సినిమా చేయాలంటే బలమైన స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్. తమకు నచ్చినట్టు రాసుకుంటూ, తీసుకుంటూ, అదే కామెడీ.. నవ్వండి అదే రీతిలో ఫిల్మ్ మేకర్స్ చెలరేగిపోయారు. ఎంత ఫ్యాంటసీ అయినా బలమైన పాత్రలు, బిగువైన కథనంతో నడిపినప్పుడే ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతారు. కానీ అవేవీ ఇందులో లేవు. ఒకపక్క వేంకటేశ్వర స్వామి ఇచ్చిన పుస్తకం, డీవోషనల్ టచ్ అంటూనే కొన్ని చోట్ల బూతుకు దిగారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం.. దేవుడిచ్చిన ‘గాడ్స్ గిఫ్ట్’ పుస్తకంలో ఏది రాస్తే అది నిజమవుతుంది. హీరో తనను ఇబ్బంది పెట్టిన రఘు బాబు పాత్రకు ఇష్టమైనది దూరం కావాలి అని పుస్తకంలో రాస్తాడు. రఘుబాబు ఉదయాన్నే నిద్ర లేచి బాత్ రూమ్ కు సూసూ వెళ్లి పోసుకుందామనుకుంటాడు. అయితే అది మాయం అయిపోయి ఉంటుంది. ఈ సీక్వెన్స్ ను చాలా సేపు రన్ చేశారు. ‘ఉప్పెన’ రెఫరెన్స్ ఇచ్చారు. అడల్ట్ జోక్స్ ఉండటం తప్పు కాదు కానీ ఒకపక్క యమలీల తరహా స్టోరీ, డీవోషనల్ టచ్ అంటూ వేంకటేశ్వర స్వామి శ్లోకాలు ప్లే చేస్తూ పవిత్రమైన ఫీల్ ఇస్తూనే మరో సీన్ లో ఇలా దిగజారడం ఎబ్బెట్టుగా ఉంది.
ఇక రైటింగ్ పరమ నాసిరకంగా ఉంది. లాజిక్ లను గాలికి వదిలేశారు. మొదట వచ్చే సీన్స్ లో ఒక చోట హీరో అందరి ఫోన్ లను టీపాయ్ మీద పెట్టండి మీకు వచ్చిన జీతాలను ఒకరి జీతం ఇంటి ఖర్చులకు, మరొకరి జీతం పిల్లల ఫీజులకు అంటూ తీర్మానం చేస్తారు. మరో చోటడ్స్ గాడ్స్ గిఫ్ట్ పుస్తకం ప్రస్తావన వస్తే చెల్లిగారు “అసలు అకౌంటే లేదు, చెక్కు పుస్తకమే లేదు. ఇంకా ఈ పుస్తకం ఎక్కడ ఉంటుంది? అంటుంది. అంటే ముందు సీన్స్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. చెల్లి గారు డైలాగ్ వేసే టైం కి అది మాయం అవుతుంది. బలదేవానంద సాగరః” అంటాడు.ఇది జోక్ లాంటిది అంటే కనీసం నలభై ఏళ్లు పైబడి ఉన్నవారికి తప్పని అర్థం కాదు.అప్పట్లో రేడియోలు ఉండేవి. రేడియో గురించి సంస్కృత వార్తలు వచ్చేవి. ఆ వార్తల్లో మొదటి లైన్ అని తెలిసి ఉండాలంటే అర్హత ముసలి వాళ్ళు ఉన్నారు.
ఈ సినిమాలో ఇంకేవీ మంచి అంశాలు లేవా అంటే. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయల డీసెంట్ పర్ఫార్మెన్స్. వేంకటేశ్వర స్వామిగా రాజేంద్ర పాత్ర బాగుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలమందే ఉన్నారు. అయితే వారి వల్ల సినిమాకి ఎటువంటీ ప్రయోజనం దక్కలేదు.
విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా మిగిలిన అంతా నాసిరకంగా, ఏఐ వాడి చుట్టేసినట్టుగా అనిపించింది. సాయికార్తీక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. సాంగ్స్ నాసిరకం. అంజి సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఈ సినిమా కథ, కథనం, డైలాగులు అన్నీ అవుట్ డెటెడ్. ఇలాంటి సినిమా ఎడిటర్ కాదు కాదా వేంకటేశ్వర స్వామి కూడా ఏమీ చేయలేడు. ఈ సినిమా 90 లలో రిలీజ్ అయినా కూడా చూడడం కష్టమే. సీరియల్ తరహా పేజీల కొద్ది డైలాగులు, ప్రతి సీన్లో ఐదారు మంది నటులు.. ఇలాంటి సీన్లను చూస్తూ చంద్రముఖంగా “మారి వారాయ్.. నానుని తేడీ.. ” నర్తించే వారు మాత్రం ఓటీటీలో ఒక్క చూపు చూడవచ్చు. అదీ మీకు ధైర్యం ఉంటేనే.. !
సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?
1. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయల యాక్టింగ్
2. మొదట్లో వచ్చే వెంకటేశ్వర స్వామి సీన్లు
బాగలేనివి ఇవి:
1. 90 ల నాటి కథా కథనాలు
2. నాసిరకం రైటింగ్, డైరెక్షన్
3. మ్యూజిక్
రేటింగ్: 1/5
చివరి పదం: ప్రేక్షకులకు పని

