తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) తీవ్ర అంతర్గత విభేదాలతో వేడెక్కింది. నిన్న ఫెడరేషన్తో సుదీర్ఘమైన సమావేశం అనంతరం ఈరోజు అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించిన ప్రస్తుత అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అధికారికంగా ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని రాజీనామా చేసిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ముగింపు పలకాలని అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి నిర్ణయించారు. అసోసియేషన్, నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. జైంట్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల అనంతరం, 2025-2027 కాలానికి గానూ మిగిలిన స్థానాల భర్తీ కోసం ఈ పార్షియల్ మోడిఫికేషన్ (ఉప ఎన్నికల) షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి విడుదల చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
జూలై 20 (ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00): నామినేషన్ల స్వీకరణ
జూలై 20 (మధ్యాహ్నం 3:00 గంటలకు): నామినేషన్ల పరిశీలన, ఫైనల్ జాబితా విడుదల
జూలై 22 (ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు): నామినేషన్ల ఉపసంహరణ
జూలై 22 (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు): గుర్తుల కేటాయింపు
జూలై 26 (ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు):
పోలింగ్ నిర్వహణ (అదే రోజు సాయంత్రం 4:30 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వచ్చాయి.
ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, జైంట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలతో పాటు 3 పురుషుల కమిటీ సభ్యులు, 2 మహిళా కమిటీ సభ్యుల పదవులకు ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
మరోవైపు, రాజీనామా చేసిన డ్యాన్సర్స్, సభ్యులు ఈ ఉప ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేవలం కొన్ని పదవులకే ప్రస్తుత ఎన్నికలు నిర్వహించడం సరికాదని, మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసిన సభ్యులందరినీ కలుపుకొని పోవాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య (TFCC) ఛైర్మన్ దిల్ రాజు, అలాగే ఫెడరేషన్ పెద్దలు సూచించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు సూచిస్తున్నారు.
అయితే అసోసియేషన్ అంతర్గతంగా ఫెడరేషన్ అనవసరంగా జోక్యం చేసుకోకూడదని, బైలాస్ ద్వారా తాము నటించామని సుమలతా దేవి వర్గం గట్టిగా వాదిస్తోంది. మొత్తానికి, తీవ్ర విభేదాల నడుమ ప్రకటించిన ఈ ఉప ఎన్నికలు అసోసియేషన్‌లో శాంతి నెలకొల్పుతాయా.. లేక వివాదాన్ని మరింత రాజేస్తాయా అనేది చూడాలి. జూలై 26న జరగబోయే పోలింగ్ టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణను తేల్చనుంది.

