భూరికార్డులు పౌరసత్వానికి స్పష్టమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు తాజాగా ఏర్పాటు చేసింది. విదేశీయులు కూడా భారత్లో భూమి కొనుగోలు చేయగలరని చెబుతూనే భారత్లో భూమి కొన్నంత మాత్రాన పౌరులు కారణమని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నసీర్ ముల్లా అనే వ్యక్తి కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.నసీర్ ముల్లా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ నసీర్ భారత పౌరుడేనని అన్నారు.
కేంద్రం మాత్రం ఈ వాదనలను కొట్టి పారేసింది. తాను విదేశీయుడినని నసీర్ స్వయంగా ఒప్పుకున్నాడని. ఈ నేపథ్యంలో తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు డాక్యుమెంట్లు చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, ససీర్కు చెందిన భూరికార్డులను మాత్రమే అతడి తరఫు లాయర్ సమర్పించారు. కోర్టు విచారణూ భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావని స్పష్టం చేసింది. ఇతర ఆధారాలను సమర్పించేందుకు జులై 20 వరకు గడువు విధించింది.

