ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు నియోజకవర్గ రైతులకు, వ్యాపారులకు సౌలభ్యంగా ఉండేలా మార్కెట్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వ్యవసాయ మార్కెట్ ప్రాంగణ నిర్మాణం దేవదాయ శాఖతో చర్చలు జరపడంతో రాప్తాడు శ్రీపండమేరు వెంకటరమణ స్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెం. 476-3లోని 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కేటాయిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు కమిటీ సభ్యులకు అనంతపురం క్యాంపు స్థలం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ సొంతంగా ప్రాంగణం లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ స్థలం జాతీయ రహదారి-44కు ఆనుకుని ఉండటంతో రవాణాపరంగా రైతులు, గొర్రెలు, మేకల సంత నిర్వహణ, వ్యాపారులకు ఎంతో అనుకూలంగా* ఉంటుందన్నారు. 11 ఏళ్ల లీజు ప్రాతిపదికన నిబంధనల ప్రకారం.. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.50,000 అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మూడేళ్లకోసారి ఈ అద్దెపై 30 శాతం పెంపు ఉంటుందన్నారు.
నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ వారికి అన్నివిధాలుగా తోడ్పడుతుందని, కమిటీ సభ్యులు చొరవ తీసుకుని వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ భూమి కేటాయింపునకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీతను మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట సుధాకర్, కార్యదర్శి కె.మల్లిక, డైరెక్టర్లు స్వర్ణక్క, లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి, మంజునాథ్, చెన్నకేశవులు,
పోతన్న, బుల్లెట్ రఫీ, నాయకులు అనిల్ చౌదరి, పామురాయి రఘు, రవిచంద్ర, సిబ్బంది లక్ష్మణమూర్తి, ధనుంజయలు కలిసి శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

