కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయగా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు కొనసాగుతున్న ఆందోళనకు టీఈసీ చీఫ్ మమతా బెనర్జీ మద్దతు పలికారు. సోమవారం (జూలై30) ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు యూత్ నిర్వహించిన ర్యాలీపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను మమత తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో యువత, విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడిని ఖండిస్తున్నానంటూ మమత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సొంత విద్యార్థులకు ప్రభుత్వం భయపడటం ఏంటి.. చర్చలకు బదులుగా ప్రశ్నలకు సమాధానమిచ్చే లాఠీ ఛార్జీలు, బాష్ప వాయు గోళాలతో సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
ఈ రోజు ఢిల్లీలో మన యువత మరియు విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఏ ప్రభుత్వం తన సొంత విద్యార్థులను భయపెడుతుంది? ఎలాంటి ప్రజాస్వామ్యం ప్రశ్నలకు సంభాషణలకు బదులు లాఠీలు మరియు బాష్పవాయువులతో సమాధానం ఇస్తుంది?
దేశం దాని విద్యార్థులకు చెందినది, దాని…
— మమతా బెనర్జీ (@MamataOfficial) జూలై 20, 2026
సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న యువతపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ర్యాలీలో పాల్గొన్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేతో సహా పలువురు ప్రతినిధులను అరెస్ట్ చేశారు. పోలీస్ లాఠీ ఛార్జ్ లో విద్యార్థులకు గాయాలయ్యాయి. నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలికి కూడా గాయాలయ్యాయి.
ఇదిలా ఉంటే.. చర్చలకు రావాలని కాక్రోచ్ పార్టీ ప్రతినిధులను ఆహ్వానించాలని సీజేపీ ప్రకటించింది. ఈ మేరకుకేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు భేటీ అయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఓ లెటర్ ను ఏర్పాటు చేసింది. ఒప్పంద జేపీ నడ్డా స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ అంతర్గత చర్చలు జరుపుతామని తెలిపినట్లు ప్రతినిధులు చెప్పారు.
మరోవైపు కాక్రోచ్ పార్టీ చేపట్టి పార్లమెంట్ మార్చ్ కు అనేక రాజకీయ నేతలు మద్దతు తెలిపారు. విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏ ప్రధాని చేయని విధంగా ప్రధానిమోదీ యువత పట్ల దారుణంగా వ్యవహరించారని.
కాగా.. కాక్రోచ్ పార్టీ అధర్వంలో నిరాహారదీక్ష చేపట్టిన పర్యావరణ ఉద్యమకారుడు, సోనమ్ వాంగుచుక్ తన దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులు, యువత పార్లమెంట్ లో ఎంపీలు కలిసేంత వరకు తన దీక్ష కొనసాగిస్తున్నారు.

