పట్టపగలు చోరీ.. బంగారం షాపులో భారీచోరీ.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి, మొహానికి ముసుగు వేసుకొని గన్స్ తో వచ్చిన దొంగలు.. షాపు ఓనర్, సిబ్బందిని బెదిరించి లక్షల విలువైన నగలు దర్జాగా దోచుకెళ్లారు. దోపీడీ చేసిన బంగారం నగలను గొనె సంచిలో మోసుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని గన్ తో గాల్లోకి కాల్పులు జరిపి భయపెట్టి చోరీ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.. చోరీకి సంబంధించిన సెల్ ఫోన్ లో రికార్డు అయింది. ఈఘటనలో పాల్ఘర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్ఘర్, దహనులోని ఇరానీ నగర్ ప్రాంతంలోని లక్ష్మీ జ్యువెలర్స్‌లో ముగ్గురు సాయుధ వ్యక్తులు సాహసోపేతమైన పగటిపూట దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు ఆయుధాలతో పట్టపగలు నగల దుకాణంలోకి చొరబడి లక్షలాది రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. pic.twitter.com/37LeiPdNWf
— నెక్స్ట్ మినిట్ న్యూస్ (@nextminutenews7) జూలై 20, 2026
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో సోమవారం (జూలై 30) సాయంత్రం 4గంటలకు ఈచోరీ జరిగింది. బైకులపై వచ్చిన దుండగులు.. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, మోహానికి ముసుగు, దేశీయ పిస్టల్స్ తో షాపులో కి ప్రవేశించి షాపు యజమాని, సిబ్బంది గన్స్ తో బెదిరించి చోరీ చేశారు. పిస్టళ్లతో బెదిరిస్తూ దోచుకున్న బంగారాన్ని ప్లాస్టిక్ సంచుల్లో నింపుకొని ధైర్యంగా మోసుకెళ్తున్న దృశ్యాలు మొబైల్ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. పారిపోయే ముందు పలువులు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించారు అయితే దుండగులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఓ నిందితుడు పోలీసులు పట్టుబడినట్టు సమాచారం.

