మైనర్ బాలికపై జరిగిన దాడి కేసులో హైదరాబాద్ 12వ అదనపు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో నమ్మించి ఒక నిరుపేద మైనర్ బాలికపై అఘాయిత్యానికి గురైన నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.
పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనితో పాటు రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఈ జరిమానా చెల్లించకపోతే, నిందితుడు మరో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
2021లో కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలికపై దాడి జరిగినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. నిందితుడిపై ఉన్న అభియోగాలను రుజువు కోసం పక్కా సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
పోలీసులు సమర్పించిన టిష్టమైన ఆధారాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి న్యాయం జరిగేలా పక్కా ఆధారాలతో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను అభినందించారు.

