తెలంగాణ:కొంపల్లి డివిజన్ పరిధిలోని జయభేరి పార్క్ సమీపంలోని పియర్సన్ స్కూల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సర్వే (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్) ఇది కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ) పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక బీఎల్ఓలతో కలిసి ఓటరు నమోదు,సవరణలు, మార్పులు,కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను సమీక్షించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకుడు,కొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించడం,ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైతే ఎన్యూమరేషన్ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఓటర్లకు అవసరమైన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని,ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని కూన శ్రీశైలం గౌడ్.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్,కావలి గోపాల్,భాస్కర్,ఖదీర్,కిషోర్,నవీన్,ఉదయ్,నాగరాజు,బాలు,శ్రీను,రవీందర్ వంటి వారు ఉన్నారు.

