ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ మరోసారి లే ఆఫ్స్ చేపట్టడానికి సిద్ధమైంది. ఈ సంస్థలో ఈసారి డేటా సెంటర్ గ్రూప్ ) పనిచేస్తున్న ఉద్యోగులకు తొలగింపుపై సమాచారం ఇచ్చినట్లు. కంపెనీ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తీసేస్తున్నారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
కంపెనీ గత 7 సంవత్సరాలుగా ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టింది. అదే విధంగా సంస్థాగత మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటెల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో సుమారు లక్షా 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 85 వేలకు పడిపోయింది. అంటే కేవలం రెండేళ్లలోనే దాదాపు 40 వేల మంది ఉద్యోగులను తొలగించారు. తాజాగా కంపెనీ డేటా సెంటర్ గ్రూప్ సంస్థలకు అవసరమైన సర్వర్ ప్రాసెసర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది.
ఈ విభాగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు సంస్థలో అవసరమైన నైపుణ్యాలను పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఇంటెల్ ప్రకటించింది. దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ మార్పులు వివరించబడ్డాయి. ఈ కంపెనీకి అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ప్రధాన తయారీ కేంద్రం ఉంది. ఇది పరిశోధన కేంద్రంగా కూడా పని చేస్తోంది. 2024 ఇక్కడ సుమారు 23 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఏడాది తర్వాత ఆ సంఖ్య 20, 200కి పడిపోయింది. 2025లో ఇక్కడ మరో 3వేల 200 ఉద్యోగాలను తీసేసింది. ప్రస్తుతం అక్కడ ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో కంపెనీ తెలపలేదు.
సెమీకండక్టర్ రంగంలో పెరుగుతున్న పోటీ, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా సంస్థను మార్చేందుకు పునర్వ్యవస్థీకరిస్తున్నామని కంపెనీ. తాజాగా ప్రకటించిన లే ఆఫ్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఏయే టీమ్స్ దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయనే వివరాలు ఇంకా బయట పెట్టలేదు. అటు మైక్రోసాఫ్ట్ కూడా రెండో విడత ఉద్యోగులను తొలగించింది. ఎక్స్బాక్స్లో పని చేస్తున్న 3,200 మంది ఉద్యోగులను తొలిగించినట్లు సమాచారం.

