ఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ముక్కు నుంచి రక్తం రావడంతో కాంగ్రెస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది.
ఈ ధర్నా నుంచి పోలీసులు బలవంతంగా రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లారు. ఈ కారణంగా ఆయనకు గాయమైంది. ముక్కు నుంచి రక్తం కారింది. వీడియోల్లో, ఫొటోల్లో ఆయన ముక్కు వెంట రక్తం స్పష్టంగా కనిపించింది. రాహుల్ గాంధీపై పోలీసుల దాష్టీకంపై కాంగ్రెస్ కార్యకర్తలు.
రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తస్రావం వచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కారు. ఈ ఉంది.. ఆయన కంటి కింద, చేతిపై గాయాలయ్యాయి.
అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీతో పాటు ధర్నాలో భాగమైన అందరినీ ఛత్రసాల్ స్టేడియంకు పోలీసులు తీసుకెళ్లారు. కనీసం డాక్టర్ను కూడా పిలువకుండా చోద్యం చూశారు. రాహుల్వ్యక్తిగత భద్రతా సిబ్బంది చికిత్స అందించారు.

