హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల ఛలో లోక్ భవన్ ఉద్రిక్తతకు దారి తీసింది
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల ఛలో లోక్ భవన్ ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర బర్తరఫ్కు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చలో లోక్ భవన్లో ప్రధాన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీగా బయలుదేరి…
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తల సారాంశం – కాంగ్రెస్ నేతల చలో లోక్ భవన్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది

