– ప్రకటన –
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులు
నవతెలంగాణ–సంగారెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాంధీ తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి జాతీయ రహదారి-65పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జగ్గారెడ్డి పిలుపు నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు. జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు కొనసాగుతున్నాయి.
– ప్రకటన –

