కందుల జెస్సీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థిని.. ఈ రోజు ప్రపంచ స్థాయి అంతరిక్ష పరిశోధన వైపు ముందడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPGHS)లో చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShakthiSAT)కి ఎంపికైన వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు పోటీ పడగా, భారత్ నుంచి ఎంపికైన కేవలం 20 మంది విద్యార్థుల్లో జెస్సీ ఒకరిగా నిలవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా రికార్డు సృష్టించింది.
పాఠశాల ప్రయోగశాలలో చిగురించిన ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఆమె ఫిజికల్ సైన్స్ టీచర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ మణిమాల కృషి ఎంతగానో ఉంది. సైన్స్ పట్ల జెస్సీకున్న తీవ్రని, జిజ్ఞాసను గమనించిన మణిమాల, ఆసక్తి ఆమెను ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేయించారు. పదో తరగతి సాధారణ సిలబస్‌కు ఎంతగానో భిన్నంగా ఉన్న ఈ కోర్సు వర్క్ ఏమాత్రం సులభంగా సాగలేదు. ఇందులో శాటిలైట్ సిస్టమ్స్, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి ఆసక్తికరమైన అంశాలు 21 మోడ్యూళ్ల ద్వారా దాదాపు 550 ఆన్లైన్ సెషన్లు ఉన్నాయి. స్కూల్ పాఠాల నుండి ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉండటంతో ప్రారంభంలో చాలా విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది, జెస్సీ ప్రతిరోజూ స్కూల్ తర్వాత క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ తన పట్టుదలను నిలుపుకుంది.
ఈ సుదీర్ఘ అభ్యాసం తర్వాత జరిగిన ఆఖరి ఎంపిక ప్రక్రియ జెస్సీ జీవితాన్నే మలుపు తిప్పింది. శాస్త్రవేత్తలు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లతో జరిగిన గంటసేపటి ఆన్లైన్ ఇంటర్వ్యూతో పాటు, మిషన్ శక్తిశాట్ ప్రాముఖ్యత, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక నిమిషం నిడివిగల వీడియోను రూపొందించారు. వీటిన్నింటిలోనూ తన ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్న ప్రభుత్వ జెస్సీ, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడమే కాకుండా, పాఠశాలల్లో చదివే వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

