- పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
నవతెలంగాణ-హైదరాబాద్: నిరసనల్లో పాల్గొనే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ముంబయి పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిజెపికి మద్దతుగా ముంబయిలోనూ కొందరు విద్యార్థుల నిరసన. అయితే వారిపై పోలీసులు బెదిరింపులకు దిగారు. నిరసనల్లో మళ్లీ మీరు నాకు కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. అప్పుడపు మీ జీవితం నాశనమవుతుంది. బెయిల్ కూడా రాదు. జైల్లోనే మగ్గిపోవాల్సి వుంటుంది. అని విద్యార్థులను ఉద్దేశించి ఒక పోలీసు అధికారి చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ముంబయి కాంగ్రెస్ ఈ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోపై నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తగిన చర్యలు తీసుకుంటాం. ఆ పోలీసుని పోస్టింగ్ నుండి తప్పించినట్లు పోలీసులు తెలిపారు.
పోస్ట్ నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాం మొదట కనిపించింది నవతెలంగాణ.

