ఆంధ్ర ప్రదేశ్ : విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్: విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణం రంపచోడవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలను తెచ్చామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు, మంచి దుస్తులు, పుస్తకాలతో సహా మధ్యాహ్న భోజన వసతి కూడా అందిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక కార్యక్రమాలతో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం నిధులను విడుదల చేశామని, అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులతో ఫొటోదిగి…
ఈ సమావేశానికి ముందు చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ ముఖాముఖి పేరెంట్స్ తో మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫోటోఫ్రేమ్ వద్ద విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో ఫోటో దిగారు. అనంతరం తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగాముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
వార్తల సారాంశం – తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

