బొద్దింక పార్టీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ ఉదంతం భారత విద్యా వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. తమ భవిష్యత్తు కోసం లక్షలాది మంది విద్యార్థులు, జెన్ జీ (Gen Z) యువత రోడ్లపైకి వచ్చి చేసిన సుదీర్ఘ పోరాటం చివరికి రాజకీయాలలోనే సంచలన మార్పులకు దారి తీసింది. 26 రోజుల పాటు సాగిన ఈ చరిత్రాత్మక ఉద్యమం జరిగింది.
సోనమ్ వాంగ్చుక్ దీక్ష.. అండగా నిలిచిన Gen Z:
మే 3న జరిగిన నీట్-యుజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం మే 12న పరీక్షను రద్దు చేసి సీబీఐ (CBI) విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించడంతోపాటు, విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష జరిగింది. ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న జెన్ జీ పూర్తి విద్యార్థులు, పెద్దఎత్తున తరలివచ్చి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాగా ఈ 26 రోజుల పాటు సాగిన ఉద్యమం గురించి ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో చూద్దాం..
మే 2026
* మే 3, 2026: దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా అభ్యర్థులకు నీట్-యుజి 2026 ప్రారంభ పరీక్ష నిర్వహించబడింది.
* మే 12, 2026: పేపర్ లీక్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి, విచారణ బాధ్యతలను సీబీఐ (CBI)కి అప్పగించింది.
జూన్ 2026
* జూన్ 6, 2026: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
* జూన్ 21, 2026: దేశంలో నీట్-యుజి రీ-ఎగ్జామ్ (తిరిగి పరీక్ష) నిర్వహించబడింది.
* జూన్ 28, 2026: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష కారణంగా.
జులై 2026
* జులై 16, 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-ఎగ్జామ్ ప్రకటించింది.
* జులై 20, 2026: పార్లమెంట్ వైపు ‘సంసద్ చలో’ భారీ ప్రదర్శన. దీంతో పోలీసులు మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
* జులై 24, 2026: కేంద్ర మంత్రులతో జరిపిన భేటీ అనంతరం సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా గురువారం నాడు కేంద్రంతో జరిగిన చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా 3 కండీషన్స్ పెట్టింది. అందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై కేసులు కొట్టివేత, నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుంటుబాలకి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
* జులై 25, 2026: ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, మిగిలిన రెండు డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
#చూడండి | ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్షణం; జంతర్ మంతర్ వద్ద నిరసన దృశ్యాలు pic.twitter.com/6YNf9LN3bN
— ANI (@ANI) జూలై 25, 2026
షాహీద్ భగత్ సింగ్ మరియు డాక్టర్ BR అంబేద్కర్ చిత్రపటాలతో భారీ ఎత్తున విద్యార్థులు మరియు యువకులు వారి ఉద్యమాన్ని ఆపడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, కన్నాట్ ప్లేస్ (CP) సర్కిల్ నుండి జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. విద్యార్థులు మరియు యువత జూలై 20న చేరుతున్నారు… pic.twitter.com/3prcrDzwWj
— CPIML లిబరేషన్ (@cpimlliberation) జూలై 20, 2026
హృదయ విదారక: 💔
విద్యార్థుల నిరసనకారులపై పోలీసులు జరిపిన దారుణాన్ని ఒక్కసారి చూడండి. ఈ విజువల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. 👇 pic.twitter.com/gcEvsUFa6o
— ప్రియా పురోహిత్ (@Priyaa_Purohit) జూలై 24, 2026
విద్యార్థులపై తాజా హింస: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జ్ మరియు బాష్పవాయువును ప్రయోగించారు.
జూలై 25న న్యూ ఢిల్లీలోని సంసద్ మార్గ్ మరియు టాల్స్టాయ్ మార్గ్ కూడలి నుండి వీడియో.
pic.twitter.com/wy8BWVIKy2— సృష్టి (@seekingsrishti) జూలై 25, 2026

