హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హైదరాబాద్ కు రానున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఏఐజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. చికిత్స పొందుతున్న బాలకృష్ణను చంద్రబాబు పరామర్శించనున్నారు. బాలకృష్ణకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు.
బాలకృష్ణకు పరామర్శ…
ఇటీవల సినిమా షూటింగ్లో నందమూరి బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన మోకాలికి శాస్త్ర చికిత్స జరగడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను చూసేందుకు చంద్రబాబు నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. పరామర్శించిన అనంతరం హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకుంటారు.
వార్తల సారాంశం – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు

