తెలంగాణ:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(మిర్యాలగూడ) మండలం ఊట్లపల్లి శివారులో శనివారం హృదయ విదారక ఘటన జరిగింది.నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయింది.
నా మనవడిని కాపాడాలి అంటూ తాత వెంకన్న ప్రాణాలను ఫణంగా పెట్టి బోరు గుంతలోకి దిగాడు.అయితే,లోతైన బోరు గుంతల్లో ఊపిరాడక ఇద్దరూ ఇరుక్కుపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
స్థానికుల కేకలతో అప్రమత్తమైన మిర్యాలగూడ రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి పరుగులు తీశారు.ప్రాణాలను లెక్కచేయకుండా గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్(రెస్క్యూ ఆపరేషన్ ) చివరికి చిన్నారిని, తాతను పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు.అయితే, అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.మనవడి కోసం ప్రాణత్యాగం చేసిన తాత కథతో ఊట్లపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామమంతా కన్నీరుమున్నీరుగా మారగా.వెంకన్న మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
రెస్క్యూ నిర్వహించి ప్రాణం కాపాడిన రూలర్ పోలీసులను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

