బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెనన్ వరల్డ్‌టూర్ సూపర్-500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టిల జోడీ అదరగొట్టింది. మలేషియాకు చెందిన గో జెఫీ – నూర్ ఇజ్జుద్దీన్‌లపై సెమీస్‌లో 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇదే తొలి ఫైనల్ కావడం.
తొలి సెట్లో మలేషియా జోడీ 21-19 తేడాతో గెలిచింది. ఆ తర్వాత భారత జోడీ పుంజుకుంది. ఉత్కంఠగా సాగిన రెండో సెట్‌ని 22-20 తేడాతో సొంతం చేసుకుంది. మ్యాచ్‌ను తేల్చే మూడో సెట్లో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే, భారత జోడీ దూకుడు ప్రదర్శించి 21-16తో సెట్‌ను.. అలాగే మ్యాచ్‌ను గెలుకుంది.

