తెలంగాణ:నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రానికి చెందిన ఎలిజెర్ల కళమ్మ-శ్రీనయ్య ( ఎలిజెర్ల కళమ్మ మరియు శ్రీనయ్య )నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ( Devarakonda MLA Nenavath Balu Naik )పాల్గొని,ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి,ఇంటి యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం పెరిగిందని,నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఎంతో ఆనందదాయకమన్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, వారి చేతుల స్పర్శలో కనిపించిన స్వచ్ఛమైన ప్రేమ తనను ఎంతో మంత్ర ముగ్ధుడిని చేసి చూపించింది.గుమ్మానికి కట్టిన మామిడాకుల తోరణంలో పేద కుటుంబాల ఆత్మగౌరవం ప్రతిబింబించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బద్యనాయక్,(అధ్యక్షుడు బద్యా నాయక్ )స్థానిక సర్పంచ్ సాధిక్,మాజీపీ గోవింద్ యాదవ్,ఎంపీపీ గోవింద్ యాదవ్,బిక్కు నాయక్,ఎంపిడిఓ లక్ష్మీ,హౌసింగ్ డిఈ,యుజవన కాంగ్రెస్ నాయకులు కిన్నెర హరికృష్ణ,సర్పంచ్ శంకర్ రావు,జిల్లా నాయకులు మల్లా రెడ్డి,మహాలక్ష్మయ్య,గిరి,మున్నయ్య,రంగయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు వంశీ,ఎడ్ల

