సర్ఫ్ తొలగింపులు, ఈవీఎంలు, ఓట్ల లెక్కల్లో తికమకలూ ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాయని బీజేపీయేతర పార్టీలే గాక స్వతంత్ర పరిశీలకులు, మాజీ ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. ఇటీవలే ముగిసింది రాష్ట్ర ఎన్నికలతో ఇది పరాకాష్టకు చేరింది. మిగిలిన వారంతా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఎన్నికల సంఘంతో పొత్తు పెట్టుకుందని ఒక సరదా రాజకీయ వ్యాఖ్య మీడియాలో కనిపించింది. ఇక పార్లమెంటుల లోనైతే ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన తీర్మానమే ప్రతిపాదించబడింది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన పేరుతో సర్‌పై జరిగిన చర్చలోనూ ఎన్నికల కమిషన్ పాత్ర పదే విమర్శకు గురైంది. తాజా ఎన్నికలలో సర్ తొలగింపు వల్లనే ఓడిపోయామంటున్నవారి పిటిషన్‌ను విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూత్రప్రాయంగా అంగీకరించారు. 2024 నుంచి ఇప్పటి వరకూ గత మూడేళ్లలో ఈ అంశం కోర్టు ఎదుట అనేక రూపాల్లో వస్తూనే వుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)తో పాటు కమిషనర్ల నియామక ప్రక్రియ కూడా అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండడం ఆసక్తికరమే గాక అనివార్య పరిణామం కూడా.దానిపై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మరింత కనువిందు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ ఎన్నికల వ్యవస్థ(సంఘం)పాలక పక్షానికి లోబడివుండే పరిస్థితి మంచిది కాదని న్యాయమూర్తి దీపాంకర్ దత్తా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వివిధ కమిటీల సిఫార్సులు
రాజ్యాంగంలో 324(2) అధికరణం సీసీని, ఈసీల నియామకాన్ని నిర్దేశిస్తున్నది. ప్రధాని సిఫార్సుపై రాష్ట్రపతి వారిని నియమిస్తారని ఈ అధికరణం చెబుతుంది. అయితే రాజ్యాంగం మౌలికంగా పార్లమెంటులో ఈ నియామకాలు జరపాలని నిర్ణయించింది, ఆచరణలో అది మంత్రివర్గ నిర్ణయంగా మారింది. ఎన్నికల కమిషనర్లపై ఒత్తిడి చేస్తున్నందున వివిధ కమిటీల కమీషన్లు అనేక మెరుగుదలలకు సిపార్సులు చేశాయి. 1972లో పశ్చిమబెంగాల్లో సీపీఐ(ఎం)ను అడ్డుకోవడం కోసం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర బలగాలను దించి ఎన్నికలను బూటకంగా మార్చివేసిన తర్వాత ఈ విషయంలో మరింత విమర్శ పెరిగింది. 1975లో జయప్రకాశ్ నారాయణ్ నియమించిన అనధికార తార్కుండే కమిటీ సీఈసీ నియామకంపై కొన్ని కీలక సిఫార్సులు చేసింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం హయాంలో నియమించబడిన గోస్వామి కమిటీ కూడా ముగ్గురితో ఎంపిక కమిటీ వుండాలని చెప్పింది. సాహసోపేతంగా వ్యవహరించి అనేక మార్పులకు కారణమైనాడని అదేపనిగా ప్రశంసలు అందుకున్నాడు. వారి నియామకాన్ని కూడా శేషన్ గుర్తించడానికి నిరాకరిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని సరిదిద్దాల్సి వచ్చింది. ఇది గత చరిత్ర. కాకపోతే ఆ బిల్లులో ఒక లోపమేమంటే నియామక ప్రక్రియకు సంబంధించి నిర్దిష్టమైన నిర్ణయం లేదు. దాంతో రాష్ట్రపతి నియమించే పద్దతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 2002, 2007లలో వివిధ పాలనా సంస్కరణల కమిటీలు సీజేఐ కాకుండా లోక్‌సభ రాజ్యసభల సభాపతులలో ఉపసభాపతులలో వుండాలన్నాయి. ఈ సిఫార్సులన్నీ కూడా కేంద్రం ఇష్టానుసారం సీసీని నియమించి అధికార దుర్వినియోగానికి నిలుపుదల లేకుండా అడ్డుకోవడానికి విస్త్రత ప్రాతిపదిక కల్పించడం కోసమే వచ్చాయి. 2015లో జాతీయ లా కమిషన్ తార్కుండే గోస్వామి కమిటీలు చెప్పినట్టే ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తిలతో కమిటీ వుండాలని కోరింది.
విధేయ కమిషనర్లు
మోడీ ప్రభుత్వ హయాంలో మిగిలిన వ్యవస్థలలాగే ఎన్నికల సంఘానికీ గ్రహణం పట్టింది. పదవీ విరమణ చేయబోయే అనుకూల అధికారులకు వీఆర్ఎస్ ఇప్పించి ఇక్కడ నియమించడం రివాజుగా మారింది. తన ముందు దాఖలైన పిటిషన్లను విచారించే అవకాశం ఉంది. 2023లో అనూప్ బనర్లాల్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ నియామకం ఎలా జరగాలో పార్లమెంటు నిర్దిష్టంగా నిర్ణయించేవరకు ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, సిజెఐలతో కూడిన కమిటీ సిఐసిని, ఈసీలను ఎంపిక చేసింది. క్యాబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్వేషణ కమిటీ పేర్లను ఈ త్రిసభ్య కమిటీ ముందుంచితే వారు సీఈసీని, ఈసీలను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫారసు చేయాలని నిర్ణయించారు, ఈ మేరకు కోర్టు తుది తీర్పు ఇచ్చేలోగా పార్లమెంటు ఆదరాబాదరాగా నియామక బిల్లును తీసుకొచ్చింది. అందులో సీజేఐ వుండాలనే సూచనను మార్చేసింది. ప్రధాని, అతి పెద్ద ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే కేంద్రమంత్రి ముగ్గురూ అని చెప్పింది. ఈ 2023 చట్టంలో అతి పెద్ద సమస్య ఏమంటే సీసీని, ఈసీని వారి తప్పొప్పులకు గాను ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేకుండా మినహాయింపు కల్పించింది. వారిని తొలగించాలంటే జడ్జిల విషయంలోనే 150 మంది ఎంపీలు సంతకం చేసి అభిశంసన తీర్మానం ఆమోదించవలసి ఉంటుంది. దాంతో నియామకంపైనా తర్వాత వారి నిర్వాకాలపైనా కూడా ఎవరికీ ఎలాంటి అదుపు లేకుండా పోయింది. 2024 ఎన్నికలలో ఈవీఎంల వినియోగం, ఓటింగు వేళల నమోదు, భద్రపరచడం, లెక్కింపులో సమస్యలు దేనికీ సమాధానం లేకుండా పోయాయి. ఎందుకంటే పార్లమెంటు ఒక చట్టం చేశాక కోర్టు కాదంటే తప్ప అదే అమలవుతుంది. సీఈసీ నియామకం అయితే చట్టం తీరు సుప్రీం కోర్లు చెప్పిన స్పూర్తికి విరుద్ధంగా ఉంటుందని కోర్టులో సవాలు చేసినా విచారణ సాగుతూ వచ్చింది. ఈ లోగానే ఈసీలో ఖాళీలు వచ్చాయంటూ 2024 మార్చిలో అప్పుడే పదవీ విరమణ చేసిన గ్యానేష్ కుమార్‌ను, డా.వీవేక్ జోషీని కమిషనర్లుగా తీసుకున్నారు. కొన్నాళ్లలోనే సీఈసీ పదవీ కాలం ముగియడంతో గ్యానేశ్ కుమార్‌కు ఆ పదవి దక్కింది. ఆ తరుణంలోనే జరుగుతున్న లొసుగులను ఎత్తిచూపిన అశోక్ లావాసా అనే ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసి బయటికి రావడంతో ఆ ఖాళీని కూడా భరితీశారు.తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నవే.
జస్టిస్ దీపాంకర్ వ్యాఖ్యలు
ఈ పూర్వరంగంలో మే 15వ తేదీన సుప్రీం కోర్టు విచారణలో జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ పెత్తనంలో వుండకూడదని ఆయనన్నారు. 1950 నుంచి సుప్రీం కోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను నిరూపిస్తూ రాజ్యాంగ మౌలిక స్పూర్తి ప్రకారం ఎన్నికలు న్యాయంగా స్వేచ్చగా జరగాలి. ఈసీ స్వతంత్రంగా వుంటనేఅది సాధ్యపడుతుందని తీర్పులన్నీ చెబుతూ వస్తున్నాయి. త్రిసభ్య కమిటీలో మీరు ప్రదాని ఎంపిక చేసిన కేంద్రమంత్రిని నియమిస్తే ఫలితం ఏమిటి? ఆయన ఆ బృందంలోనే సభ్యుడై వుంటారు కదా? మొత్తం 300 మంది ఎంపీలలో 25మందిని మంత్రులుగా ప్రధాని తీసుకున్నారు. మళ్లీ అందులో ఒకరిని తెచ్చి ఇక్కడ పెడతామంటారు. ఆ మంత్రి ప్రధాని మాట కాదనే ప్రసక్తి వుంటుందా? ఇక ప్రతిపక్ష నేత పాత్ర ఏమిటి? ప్రభుత్వం తరపు వారు ఇద్దరైతే ఇక ప్రతిపక్ష నేత మాట ఎలా చెల్లుతుంది? ఎప్పుడూ ఎంపిక కమిటీలో 2-1 నిష్పత్తి వుంటే నిష్పాక్షికంగా నియామకం ఎలా సాధ్యం? ఈవిధంగా ఎన్నికల సంఘం స్వతంత్రతను అడ్డుకోవడమేంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
పూర్తిగా దీపాంకర్ వ్యాఖ్యలు కేంద్రం ఏకపక్ష సమర్థన
అటార్నీ జనరల్ వెంకటరమణి అడ్డు తగులుతూ ఆ కమిటీని నియమించినంతమాత్రాన ఎన్నికల కమిషన్ స్వతంత్రత కోల్పోతుందని మీరెలా చెప్పగలరని అడ్డు సవాలు విసిరారు. మరో సుప్రీంకోర్టు పార్లమెంటు సభగా ఆరిపోరాదని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొన్ని చట్టాలు చేయాలని పిటిషనర్లు భావించరాదని కూడా తీసిపారేశారు. అనూప్ బన్వర్‌లాల్ కేసులో చెప్పింది ఒక మధ్యంతర ఏర్పాటు మాత్రమేనని, తుచ తప్పకుండా దాన్నే అనుసరించాలిస్న అగత్యం లేదని వాదించారు. న్యాయమూర్తి ః మీరు దానిపై రాజ్యాంగం తర్వాత అంత ముఖ్యమైందిగా పరిగణించే చట్టం ఏమిటని ఆయన ఎజి వెంకటరమణికి ప్రశ్న వేశారు. తన కీలక ఉద్దేశంలో ఎన్నికల చట్టాలే అంతమైనవని తానే సమాధానమిచ్చారు. ఒక దశలో ధర్మాసనం ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం మంచిదనే సూచన కూడా వచ్చింది. అయితే 2023 చట్టాన్ని సాధారణ తరహాలో సవాలు చేయడం తప్ప రాజ్యాంగపరమైన సమగ్ర ప్రశ్నల జోలికి తాము వెళ్లడం లేదని పిటిషనర్ స్పష్టం చేశారు. 2024లో అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ ప్రారంబించబోతుండగా ఆఘమేఘాల మీద గ్యాన్స్ కుమార్ నియామకం జరిగింది. దాంతో వారి నియమకాల రికార్డులు సమర్పించవలసిందిగా న్యాయమూర్తి. సీబీఐ డెరెక్టర్, కేంద్ర సమాచార ప్రదాన కమిషనర్ వంటి నియామక కమిటీలలో సీజేఐ సభ్యులైనప్పుడు ఎన్నికల కమిషనర్ విషయంలో మరోలా ఎందుకు ప్రశ్నించారు. అయితే సీఈసీ, ఈసీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దేశం తీవ్రమైన పరిస్తితులు ఎదుర్కొన్న ఉదంతాలేమీ లేవు గనక అనవసరంగా కంగారు పడనవసరం లేదని ఈజీ వింతవాదన చేశారు. అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు జరుగుతున్న పోరాటం, ఈవీఎం వివాదాల స్థిర లెక్కలోనే లేవన్న మాట. అంతేగాక కేంద్రం అధికారికంగా సమర్పించిన అఫిడవిట్లోనైతే అసలు సీజేఐ ఆ ఎంపిక కమిటీలో వుండాలని ఎక్కడాల ఏదని కొట్టిపారేశారు. ఏదైనా తప్పుంటే కోర్టు చూసే అవకాశం ఉందా లేదా అనేది తప్పా చట్టం ఎలా చేయాలో కోర్టు చెప్పజాలదని వాదించారు. మొత్తంపైన చూస్తే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికల సంఘాన్ని తనకు నచ్చినవారితో నింపడం కొనసాగుతుందని స్పష్టమవుతుంది.
చివరికి ఏమైనా? అయిదు రాష్ట్రాల ఎన్నికల అవకతవకలపై పిర్యాదులే గాక మలి విడత సర్‌కు ఇసి పూరితంగా సిద్ధమవుతుండగా తరుణంలోనే సుప్రీం ముందుకు ఈ కేసు రావడం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో తొలగింపులు భారీగా జరిగాయి. అక్కడ ఓటమి తేడా తొలగించిన ఓట్ల కన్నాతక్కువ గా వుంటే మళ్లీ విచారణకు రమ్మని అప్పట్లో సీజేఐ సూర్యకాంత్ హామీ ఇచ్చారు. 30 సీట్లలో ఆ విధంగానే సర్ వల్ల ఓడిపోయామంటూ తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా వాటిని ఎన్నికల పిటిషన్‌గా విచారిస్తామన్నారు. ఈ విచారణ ఎప్పుడు ఎలా జరుగుతుందో చూడవలసి వుంది. ఈ లోగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలోసర్ సర్కస్ మళ్లీ మొదలవుతోంది. ఏపీ తెలంగాణల్లో కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అనుభవాలు చూశాక ఇది ఎలా జరుగుతుందనేది పెద్ద సవాలుగానే మారింది. వామపక్షాలు కాంగ్రెస్ వైసీపీ బిఆర్ఎస ఈ అంశంపై అప్రమత్తత తప్పదని భావిస్తున్నారు. సర్ విషయంలో సుప్రీం కోర్టు ఇంతవరకూ సంతృప్తికరమైన విచారణ జరిపి సరైన ఉత్తర్వులు ఇవ్వలేదు, మరి సీఈసీ ఈసీల నియామకంపై కేంద్రం పెత్తనాన్ని గురించి చేసిన వ్యాఖ్యలైనా తుది ఉత్తర్వుల్లో పొందుపరుస్తుందా లేదా చూడాలి.
తెల్లకపల్లి రవి
పోస్ట్ సీసీపై కేంద్రప్రవేశం-సుప్రీం అభ్యంతరం మొదట కనిపించింది నవతెలంగాణ.

