జగపతి బాబు లుక్ ఇన్ పెద్ది: సుకుమార్ స్కూల్ నుండి వచ్చే ప్రతీ డైరెక్టర్, కథ కంటే ఎక్కువగా క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. సుకుమార్ తన శిష్యులకు అదే నేర్పించాడు. ముఖ్యంగా ఆయన ప్రియ శిష్యుడు బుచ్చి బాబు గురువు ని తూచా తప్పకుండ అనుసరించే మనిషి. సుకుమార్ ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇస్తాడో , బుచ్చి బాబు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తాడు. మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే తన మార్క్ ఏంటో అందరికీ చూపించాడు. ఇప్పుడు ‘పెద్ది’ కి కూడా ఆయన అదే ఫార్ములా ని అనుసరించాడు. ఈ చిత్రంలో కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక్కటే కాదు , ప్రతీ క్యారెక్టర్ కూడా హైలైట్ అవ్వబోతుంది అని హింట్స్ ఇస్తున్నాడు. ఎల్లుండి ట్రైలర్ లో చూపించబోయే క్యారెక్టర్స్ అన్నిటిని ఆయన రోజు కి ఒకటి రివీల్ చేస్తూ వస్తున్నాడు.
ముందుగా ఈ చిత్రం లో రామ్ చరణ్ కుస్తీ గురువుగా నటించిన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని పరిచయం చేసారు, ఆ తర్వాత మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు క్యారెక్టర్ ని పరిచయం చేసారు , ఇక నేడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు క్యారెక్టర్ ని పరిచయం చేసారు . చాలా రోజుల క్రితమే జగపతి బాబు కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ఆయన ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. జగపతి బాబు మేక్ ఓవర్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి సిద్ధమయ్యారు. అసలు చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగిన జగపతి బాబు ఈయనేనా?, ఇలా ఉన్నదేంటి?, బయటకు ఆయన ఆ గెటప్ లో వస్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు.
అయితే నేడు ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో విడుదల చేయబడలేదు , ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతోంది. ముందుగా ఆ విలన్ క్యారెక్టర్ ని చూసి అందరూ విలన్ క్యారెక్టర్ అనుకున్నారు , కానీ ఆయన తన ఊరి సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ ని చూస్తే తెలుస్తోంది. కచ్చితంగా ఆయన కెరీర్లో ఈ క్యారెక్టర్ ఒక ల్యాండ్ మార్క్ లాగా మిగిలిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. జూన్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని చూసి జనాలు రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఏ రేంజ్ లో మాట్లాడుకుంటారో , జగపతి బాబు క్యారెక్టర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటారని అంటున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూడండి.
ఉద్దేశ్యంతో నడిచే భావోద్వేగంలో పాతుకుపోయింది
కలవండి #అప్పలసూరి అకా @iamjaggubhai గారు
#PEDDITరైలర్ మే 18 నుంచి టేకోవర్#పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో.#పెద్ది కోసం సిద్ధంగా ఉండండి pic.twitter.com/MjjA4P1WMN
— PEDDI (@PeddiMovieOffl) మే 16, 2026

