చెన్నై : మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. బీజేపీ కూటమి చేతగానితనం వల్లనే గత కొన్నేళ్లుగా ఏ పరీక్ష నిర్వహించినా అది లీక్ అవుతూ వచ్చిందన్నారు. ఈ ఏడాది మే 3వ తేదీన నిర్వ హించిన నీట్ యుజి 2026 పరీక్ష నిర్వ హించింది నేష న ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) . దేశ వ్యాప్తంగా 26 లక్షలకు పైగా పరీక్షలు రాశారు. బీజేపీకి చెందిన నాయకుడు ఈ పరీక్ష పేపర్లను లీక్ చేయడం కలకలం రేపింది. దీనితో గత్యంతరం లేక దర్యాప్తు సంస్థ సీబీఐని విచారణకు కేంద్రం. 2026–27 విద్యా సంవత్సరానికి నీట్‌కు మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. మార్కుల ఆధారంగా విద్యార్థులను చేర్చుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలి.
ఇటీవల నీట్-యూజీ 2026ను రద్దు చేయడం, అత్యంత కేంద్రీకృత పరీక్షా విధానంలో అంతర్లీనంగా ఉన్న లోతైన నిర్మాణాత్మక లోపాలను మరోసారి బట్టబయలు చేసిందన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో జరిగిందన్నారు. నీట్‌కు మినహాయింపు ఇచ్చేందుకు, ఎన్కానిక్ చట్టం, 2019లోని సెక్షన్ 14ను సవరించడానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా విద్యార్థులను చేర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా ప్రశ్నపత్రం అయిన నేపథ్యంలో నీట్-యూజీ 2026 పరీక్షను దిగ్భ్రాంతికరంగా రద్దు చేసిన నేపథ్యంలో, జాతీయ అర్హత-ప్రవేశ పరీక్షకు సంబంధించి పదేపదే జరుగుతున్న వైఫల్యాలు, వ్యవస్థాగత లోపాలు, పెరుగుతున్న ప్రజా అపనమ్మకం పట్ల ఆయన “తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

