ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇంకా మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇక మే 18వ తేదీన ఆసక్తికర మ్యాచ జరుగనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకమైంది. అయితే ఇది చెపాక్‌లో ఈ సీజన్లో జరిగే అఖరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఎస్కె స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉందని సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ సీజన్లో ధోనీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. దీంతో అభిమానులు అతడి ఆటని మిస్ అవుతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ధోనీ పాల్గొని.. ఐపిఎల్ బై చెప్పనున్నాడని గుర్తు చేశారు. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికైతే ఇది కేవలం ఊహాగానాలే. అయితే వాటిపై క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”ఎస్కె – ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో సర్ప్రైజ్ను చూసే అవకాశం ఉంది. ఈ సీజన్లో చెపాక్ వేదికగా ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం వచ్చిందా.. నేనేమీ అనుకోను” అని భోగ్లే అన్నారు.

