పంజాబ్ కింగ్స్: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా 6 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ధర్మశాల వేదికగా ఆదివారం (మే 17న) జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 23 పరుగుల తేడాతో పంజాబ్ ని చిత్తుగా ఓడించింది. ఆర్సీబీ ఇచ్చిన 223 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా ఓడింది. ఈ పరాజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ మరింత క్లిష్టం కాగా, ఆర్సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ని ఖరారు చేసుకుంది.
పంజాబ్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే?:
టోర్నమెంట్ ప్రారంభంలో వరుసగా 6 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుత పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు ఒక మ్యాచ్ డ్రాతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. నాలుగో స్థానం కోసం పోటీపడే ఇతర జట్లు 14 పాయింట్లు ఉంటే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఫిక్స్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కదాంట్లో ఓడిపోవాలి.. రాజస్థాన్ రాయల్స్ కూడా తన మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోతే. చూస్కోవాల్సి ఉంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడినా ఛాన్స్:
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ప్లే ఓడినా ఆఫ్స్ చేరే ఛాన్స్. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR).. ముంబై ఇండియన్స్ (MI) చేతిలో భారీ తేడాతో ఓడిపోయి, ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడిస్తే, పంజాబ్–కోల్‌కతా పాయింట్లలో సమకూరుతుంది. అప్పుడు మెరుగైన NRR ఉన్న జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. పంజాబ్ కింగ్స్ పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

