నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు – మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు
ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి
విశాలాంధ్ర – ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న ఉరవకొండ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఎం. కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే తెలుసుకొని కనీసం అరగంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
25095 బాలికల జూనియర్ కళాశాల కేంద్రానికి వి.హెచ్.బి. షాషావలి, 25097 ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రానికి నారాయణ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చర్యలు చేపట్టకూడదని విద్యార్థులు సూచించారు. పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
2026–27 విద్యా సంవత్సరానికి జూనియర్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ప్రిన్సిపాల్. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు కళాశాలను సందర్శించి తమకు కావలసిన గ్రూపుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ప్రైవేట్, కళాశాలల మాయలో పడకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వ కళాశాలలోనే జూనియర్ విద్యార్థులను చేర్చుకోవాలని కోరారు. ఈ మార్చి ఏడాది పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు తమకు నచ్చిన ఏ గ్రూప్‌లోనైనా ఉచితంగా చేరే అవకాశం ఉంది. దీనికి కావలసిన ఫీజును కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక సిబ్బంది కలిసి చెల్లిస్తారని చెప్పారు. అలాగే మొదటి సంవత్సరం పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయాలని నిర్ణయించినట్లు.

