బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి. అంతేనా.. వారికి ఘన స్వాగతాలు, మర్యాదలకు లోటు కూడా ఉండవు. గతంలో రాజస్థాన్(బీజేపీ పాలిత రాష్ట్రం)లో రేప్ కేసులో దోషులుగా తేలిన వారు జైలు నుంచి బయటకు వస్తే.. వారికి బీజేపీ నాయకులే.. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇది అప్పట్లో పెను దుమారం రేపింది. ఇక, ఉన్నావ్ కేసులో నిందితుడికి కూడా బీజేపీ నాయకులు బెయిల్ ఇప్పించి.. బయ’టకు వచ్చాక ఊరేగింపుగా ఇంటికితీసుకువెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి ఘటనే తాజాగా బీజేపీ పాలితరాష్ట్రం, నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే ముఖ్య మంత్రిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తర ప్రదేశ్లో జరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల అనుబంధ విభాగం.. హిందూ యువ వాహిని మాజీ సభ్యుడు సుశీల్ ప్రజాపతికి ఆ పార్టీ కార్యకర్త ఘనస్వాగతం పలికారు.
రెండు చేతులతో ఎత్తుకుని ఊరేగిస్తూ.. ఆయనను జైలు నుంచి తీసుకువచ్చారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోనీ.. ఈయనేమన్నా.. సామాజిక సేవ చేసి జైలుకు వెళ్లి ఉంటే ఇలా చేయడం తప్పుకాదు. కానీ, ఆయన పక్కాగా ఓ యువతిపై అత్యాచారం చేసిన పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. తన రూంకు పిలుచుకున్న ప్రజాపతి.. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారించి ప్రజాపతిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అయితే.. 9 మాసాల కింద కోర్టు అతనిపై ఉన్న నేరాభియోగాలు తీవ్రంగా ఉన్నాయంటూ.. బెయిల్ నిరాకరించి.. జైలుకు పంపించింది.
చివరకు తాజాగా మంగళవారం స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో హిందూవాహిని కార్యకర్తలు.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ.. జైలు నుంచి ఊరేగింపుగా ప్రజాపతిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది.
దీనికి భిన్నంగా.
మరోవైపు అదే బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో మాత్రం తమ వాడుక ఎందుకంటే.. ఓ ముస్లిం మైనారిటీ వ్యక్తికి చెందిన భవనాన్ని కూల్చి వేశారు. పోనీ.. ఆయనేమన్నా రేప్ చేశాడా? చేయించాడా? అలాంటి కేసుల్లో ఏమైనా చిక్కుకున్నాడా? అంటే అది కూడా లేదు.
టీసీఎస్ వ్యక్తిగత వేధింపుల్లో ఆరో’ణ’లు ఎదుర్కొంటున్న ఓ మహిళకు ఆశ్రయం ఇచ్చాడు. దీంతో సదరు భవనాన్ని నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్.. రాత్రికి రాత్రి కూల్చి వేసింది. అదే హిందు వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటే.. కాపాడేవారన్న చర్చ రెండు రోజుల నుంచి మీడియాలో జరుగుతున్న విషయం తెలిసిందే.

