Avengers Doomsday : ప్రపంచవ్యాప్తంగా ‘మార్వెల్ స్టూడియోస్’ సంస్థ వచ్చే సినిమాలకు , ముఖ్యంగా ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చే సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ కి మన ఇండియన్స్ లో కూడా వేరే లెవెల్ క్రేజ్ ఉంది. మన ఇండియన్ సూపర్ స్టార్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ఈ సిరీస్ కి కూడా అదే రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఈ సిరీస్ నుండి రాబోతున్న తదుపరి చిత్రం ‘ఎవెంజర్స్ : ధూమ్స్ డే’. ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల చేయబోతున్నట్టు , ఆ చిత్ర నిర్మాతలు నేడు థియేకల్ ట్రైలర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి గూస్ బంప్స్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ ట్రైలర్ ఆరంభం లో డాక్టర్ ధూమ్ ని చూస్తే ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ లో థానోస్ ని మించినోడు అనే ఫీలింగ్ కలిగింది. అతనితో యుద్ధం చేయడానికి ‘థోర్’ ఎంతో కష్టపడడం ని చూస్తుంటే , ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య భీకర పోరు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్లో ‘థోర్’, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ మార్వెల్’ లతో పాటు హల్క్ ని కూడా చూపిస్తారు. ఇక మిగిలిన సూపర్ హీరోలు కూడా ఇందులో ఉన్నారు కానీ , కెప్టెన్ అమెరికా , స్పై డర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్ లు మాత్రం లేరు. కెప్టెన్ అమెరికా తన ఆయుధాన్ని త్యాగం చేసి, వృధాప్యం ని స్వీకరించి ఈ యూనివర్స్ నుండి తప్పుకున్నట్టు ‘ఎవెంజర్స్ : ఎండ్ గేమ్’ లోనే చూపిస్తారు. కాబట్టి ఆయన క్యారెక్టర్ కి ఎండ్ కార్డు పడినట్టే.
ఇక ఐరన్ మ్యాన్ కూడా చనిపోయినట్టు చూపిస్తారు కాబట్టి, ఈయన క్యారెక్టర్ కూడా సినిమాలో ఉండే అవకాశం లేదు. కానీ ఒక్క సన్నివేశం లో మాత్రం ఆయన పాత్ర కనిపిస్తుందని టాక్, అదే జరిగితే వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అంటే చెప్పాలి. ఇక ఎంజర్స్ లో యాక్టీవ్ ఉండే స్పై డర్ మ్యాన్ ఈ ట్రైలర్ లో కనిపించడం లేదు. అసలు ఆయన క్యారెక్టర్ ఇందులో ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని మీకోసం క్రింద అందించాము చూడండి.
డూమ్స్‌డే డిసెంబర్ 18న వస్తుంది.
ఎవెంజర్స్‌ను అనుభవించండి: పెద్ద, ప్రకాశవంతంగా మరియు మరింత లీనమయ్యే స్క్రీన్లలో డూమ్స్‌డే. ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ థియేటర్ల కోసం టిక్కెట్లు ఇప్పుడు ప్రత్యేకంగా విక్రయించబడుతున్నాయి: https://t.co/2HHPv9pj8t pic.twitter.com/zpsrdHbpHE
— మార్వెల్ స్టూడియోస్ (@మార్వెల్స్టూడియోస్) జూలై 20, 2026

