బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. వెండి దరలు కూడా తగ్గాయి. దాదాపు రెండు వేల రూపాయలు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై తగ్గింది. అలాగే కిలో వెండి ధరపై దాదాపు తొమ్మిది నుంచి పది వేల రూపాయలు తగ్గడంతో భారీ ఊరట లభించినట్లే.
ధరలు ఇలా…
దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 గ్రాముల పది గ్రాముల బంగారం ధర 1,35,000 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 2,40,000 రూపాయలకు చేరింది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

