Jr NTR Teja Director : చిత్రం, నువ్వు నేను, జయం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తేజ… అప్పట్లో ఆయనకు చాలా మంచి క్రేజ్ ఉండేది. యంగ్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. ఇక ఈ కోరికనే జూనియర్ ఎన్టీఆర్ సైతం తేజ తో సినిమా చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్ ఇప్పటికే ఆది, సింహాద్రి లాంటి వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించడంతో తను మాస్ హీరోగా మారిపోయాడు. తేజ లవ్ స్టోరీ లను మాత్రమే తీస్తాడు. అలాగే ఆయన సినిమాల్లో హీరో చాలా వీక్ గా ఉంటాడు. విలన్ ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా హీరోగా పెద్దగా రియాక్ట్ అవ్వడు. అలాంటి క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని చూపిస్తే అప్పుడు ఎన్టీఆర్ టాప్ లో ఉన్నాడు.
అందుకే తన ఇమేజ్ కి ఇబ్బంది అవ్వచ్చనే ఉద్దేశ్యంతోనే తేజ ఎన్టీఆర్ తో సినిమా చేయలేనని చెప్పారట. దాంతో ఎన్టీఆర్ కూడా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఎన్టీఆర్ కి తేజ డైరెక్షన్లో నటించాలని ఉన్నప్పటికి అది వర్కౌట్ కాలేదు.
ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చినా కూడా అది సక్సెస్ అయితే అది కాదని ఇప్పటికి కొంతమంది సినిమా మేధావులు చెబుతారు. నిజానికి తేజ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి ఎన్టీఆర్ పనికిరాడు. ఎన్టీఆర్ ఇప్పటికే వి వినాయక్, రాజమౌళి లాంటి స్టార్లతో సినిమాలు చేశాడు. కాబట్టి వాళ్ల స్టాండర్డ్స్ వేరు తేజ స్టాండర్డ్స్ వేరు…
ఇప్పటికే పూర్తిగా కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిపోయిన ఎన్టీఆర్ తన అభిమానులు సైతం అతన్ని తేజ సినిమా చూసి జీర్ణించుకోలేరు అన్నది వాస్తవం… అందుకే తేజ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయకపోవడం మంచిదైందని ఇప్పటికి చాలా మంది చెబుతారు…

