రూరల్ సీఐ ప్రభాకర్
విశాలాంధ్ర – ధర్మవరం;; జిల్లా ఎస్పీ నేరస్థులకు అనుగుణంగా మహిళా భద్రత, సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ని పోతుకుంట గ్రామంలో ధర్మవరం రూరల్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజశేఖర్, అత్యవసరపోలీసు సిబ్బంది మహిళలపై అవగాహన ర్యాలీతో పాటు ర్యాలీ నిర్వహించారు. శక్తి యాప్ వంటి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
మహిళల పట్ల ఎలాంటి వేధింపులు, అనుమానాస్పద సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలో మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు ,ధర్మవరం రూరల్ ఎస్సై రాజశేఖర్ , పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఉన్నారు.

